loader

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘జైలర్’ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. మరి, బిజినెస్ సంగతి ఏంటి? థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? ప్రపంచవ్యాప్తంగా ఎలా జరిగింది? అనే వివరాల్లోకి వెళితే… ‘జైలర్’ తెలుగు రైట్స్ రూ. 12 కోట్లు!Jailer Movie Telugu Rights : తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్’ థియేట్రికల్ రైట్స్ కేవలం రూ. 12 కోట్లకు మాత్రమే ఇచ్చారు. రజనీకాంత్ లాస్ట్ సినిమా ‘పెద్దన్న’ రైట్స్ కూడా అంతే! సూపర్ స్టార్ నటించిన గత కొన్ని సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన విజయాలు సాధించలేదు. అందుకని, డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ రేటు పెట్టి కొనడం లేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ‘జైలర్’ పంపిణీ హక్కులను ఆంధ్ర ఏరియా వరకు 5 కోట్ల రూపాయల రేషియోలో విక్రయించారు. నైజాం హక్కులను రూ. 4.50 కోట్లకు ఇచ్చారని తెలిసింది. సీమ (సీడెడ్) హక్కులను రూ. 2.5 కోట్లకు ఇచ్చారట. తెలుగు రాష్ట్రాల వరకు బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 13 కోట్లు కలెక్ట్ చేయాలి. రూ. 30 కోట్ల నుంచి రూ. 12 కోట్లకు…రజనీకాంత్ మార్కెట్ కిందకు పడిందా?ఆరేడేళ్ళ క్రితం వరకు రజనీకాంత్ సినిమాలకు తెలుగులో అగ్ర కథానాయకుల సినిమాలతో సమానంగా బిజినెస్ జరిగింది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved