loader

ముంబై ఇండియన్స్ (Mumbai Indians), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య లక్నో వేదికగా ఆసక్తికర పోరు జరగనుంది. లీగ్ టేబుల్లో టాప్ 2లో నిలవాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ తో పాటు.. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో నెగ్గాల్సి ఉంది. ఒక వేళ ఈ మ్యాచ్ లో ఓడినా ముంబై ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ లో తప్పక నెగ్గాల్సి ఉంటుంది. ఇక లక్నో విషయానికి వస్తే ప్రస్తుతం 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఓడితే ప్లే ఆఫ్స్ అవకాశాలకు దెబ్బ పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ ముంబై కంటే కూడా లక్నోకే అత్యంత కీలకంగా మారింది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved