loader

యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.
ప్రస్తుతం వరుస షోలతో సూపర్ బిజీగా ఉన్న శ్రీముఖి తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. శ్రీముఖి సైమా అవార్డ్స్ ఫంక్షన్‌ను ఆలీతో కలిసి హోస్ట్ చేస్తోంది. ఇక ఈ ఫంక్షన్‌కు హిందీ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ హాజరైయారు.ఇక రణవీర్ సింగ్ డయాస్ నుంచి వెళ్లిపోతుండగా.. శ్రీముఖి, రణవీర్ సింగ్‌ను పిలిచి.. హగ్ కావాలనీ కోరింది. దీంతో ఆయన శ్రీముఖికి.. హగ్‌తో పాటు ముద్దు కూడా ఇచ్చారు. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved