loader

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరచూ సమావేశం అవుతున్నారు. వీరి సమావేశాలపై వైసీపీ నుంచి రాజకీయ విమర్శలు వస్తున్నా.. ఇద్దరు నాయకుల మధ్య సమావేశాలు మాత్రం ఆగడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులు ఖాయమనే విధంగా అటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తుండటంతో.. రాజకీయవర్గాల్లోనూ వీరి పొత్తులపై మెల్లిమెల్లిగా క్లారిటీ వస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన కలిసి అధికార వైసీపీనీ ఎదుర్కోవాలని భావిస్తున్నాయని.. తమతో బీజేపీ కూడా కలిసి వస్తే.. తమ కూటమి విజయం మరింత సులువు అవుతుందనే భావనలో టీడీపీ, జనసేన ఉన్నాయి

© Copyright 2022 Newz Blog. All Right Reserved