loader

‘బ్రో’ సినిమా విడుదలైన తర్వాత రాజకీయ రగడ మొదలైంది. తాను చేసిన నృత్యాన్ని (ఆనంద తాండవం అని వర్ణించారనుకోండి) అవహేళన చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ‘బ్రో’ (Bro Movie) అట్టర్ ఫ్లాప్ అన్నారు అంబటి. కలెక్షన్స్ రావడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కోట్లకు కోట్లు పారితోషికం తీసుకోవడం వల్ల నిర్మాతలకు నష్టాలు వస్తున్నాయన్నారు. సినిమా నిర్మాణంలో మనీ రూటింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆ ఆరోపణలకు సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు మ్యాటర్ అది కాదు… ‘బ్రో’లో రెండు మూడు సెటైర్స్ పడితే అంతెత్తున మండిపడ్డ అంబటి రాంబాబు, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలైన తర్వాత ఏమైపోతారో? అని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ‘ఉస్తాద్…’లో పొలిటికల్ సెటైర్ల సునామీ!జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఆయన డై హార్డ్ ఫ్యాన్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. సంక్రాంతి బరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పొలిటికల్ సెటైర్స్ ఓ స్థాయిలో ఉంటాయని క్లారిటీ వచ్చింది. ‘బ్రో’లో రెండు అంటే రెండు పొలిటికల్ సెటైర్ సీన్స్ ఉన్నాయి. అవి శాంపిల్ అయితే… ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో సెటైర్స్ సునామీ ఉంటుందని హరీష్ శంకర్ కన్ఫర్మ్ చేశారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved