loader

మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సంక్రాంతికి రేసులో నిలవబోతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం. అందుకు తగ్గట్లుగా టీమ్ వదులుతున్న అప్‌డేట్స్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నాయి.
నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవినవుతా అంటూ సాగే పాటను చిరంజీవి లీక్ చేసినా కూడా రీసెంట్ గా ఈ సాంగ్ విడుదల చేయడంతో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ గురించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.

© Copyright 2022 Newz Blog. All Right Reserved