loader

యూనిఫాం సివిల్ కోడ్‌కు మూలస్తంభంగా ఉండే సూత్రాలకు ముస్లిం మహిళల్లో విస్తృతమైన మద్దతు ఉందని సర్వే కీలక ఫలితాలు చెబుతున్నాయి:
– కామన్‌ లా
సర్వేలో పాల్గొన్న ముస్లిం మహిళల్లో దాదాపు 67 శాతం మంది భారతీయులందరికీ కామన్‌ లా ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్-లెవల్ ఎడ్యుకేషన్‌ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న మహిళల్లో దాదాపు 68 శాతం మంది కామన్‌ లా అవసరమని చెప్పారు.
– బహుభార్యత్వంపై వ్యతిరేకత
76 శాతం మంది ముస్లిం మహిళలు బహుభార్యత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లిం పురుషులకు ఒకరి కంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకునే హక్కు ఉండకూడదని చెప్పారు. ఉన్నత విద్యార్హతులు ఉన్న మహిళల్లో ఏకంగా 79 శాతం మంది బహుభార్యత్వాన్ని తప్పుబట్టారు.
– వారసత్వ సమాన హక్కులు
సర్వేలో పాల్గొన్న ముస్లిం మహిళల్లో అత్యధికంగా 82 శాతం మంది జెండర్‌తో సంబంధం లేకుండా వారసత్వ సమాన హక్కులు కావాలని డిమాండ్‌ చేశారు. దీనికి గ్రాడ్యుయేట్-లెవల్‌, అంతకంటే ఎక్కువ విద్యార్హతులు ఉన్న మహిళల్లో 86 శాతం మద్దతు తెలిపారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved