loader

సాధారణంగా మనం బోరుబావి నీటిని మిషన్లు, వివిధ రకాల కెమికల్స్ వేసి ఫిల్టర్ చేస్తే కానీ నీటిలో సాధారణ పీహెచ్ స్థాయి రాదని కన్వీనర్ ఎం.వీ శివకుమార్రెడ్డి తెలిపారు. అయితే ఇక్కడ ప్రవహించే నీటిలో మాత్రం పీహెచ్ 7.1 స్థాయి ఉండటం విశేషమని తెలిపారు.భూగర్భ జల వనరుల శాఖ, ఉపరితల జలసంరక్షణ, తెలుగుగంగ ప్రాజెక్ట్ అధికారుల చేత పరిశోధనలు సంవత్సరా కాలం పాటు పరిశోధన చేయించాక.. ఈ మేరకు కోనేరులు, వాటి చుట్టు కొలత, నీటి స్థాయి, తగ్గకుండా ప్రవహించడం, నీటిలో ఉన్న మినరల్స్, తదితర అంశాలపై పరిశోధనల ఫలితాలు వచ్చాయని చెప్పారు.క్యాల్షియం కార్బోనేట్, కాల్షియం, క్లోరైడ్, సల్ఫేట్, మెగ్నీషియం, హైడ్రోకార్బోనేట్, సోడియం తదితర మినరల్స్ ఈ నీళ్లలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. అందుచేతనే ఈ నీళ్లకు ఇంటాచ్ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved