loader

16వ రోజు బాక్సాఫీస్ దగ్గర ‘సలార్’ రచ్చ.. సంక్రాంతి ముందు ప్రభాస్ దూకుడు..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సలార్. బాహుబలి తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అటు జవనరి 1వ తేదిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది.మొత్తంగా 16వ రోజు ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది.ముఖ్యంగా సలార్ మూవీ రూ. 1000 కోట్ల టార్గెట్ పూర్తి చేయాలంటే కీలకమైన నార్త్‌లో ఈ సినిమా బాగా పర్ఫామ్ చేయాలి. తాజాగా రూ. […]

అరకు వెళ్లేవారికి రైల్వే గుడ్ న్యూస్… అదనంగా మరిన్ని అద్దాల బోగీలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంక్రాంతి సెలవుల్ని ప్రకటించడంతో మళ్లీ హాలిడే సీజన్ మొదలైంది. అరకు వెళ్లాలనుకునేవారికి రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా అద్దాల బోగీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పచ్చని వాతావరణం, వలస పువ్వుల ఆహ్వానం, చల్లటి మంచు తెరలు అరకు సొంతం. డిసెంబర్, జనవరి వచ్చిందంటే అరకు వెళ్లే పర్యటకులు అధిక శాతం ఉంటారు. రైలు మార్గం ద్వారా అద్దాల రైలు ఉండడంతో అధిక శాతం పర్యటకులు ఈ రైల్లో ప్రయాణం చేయడం జరుగుతుంది.అద్దాల బోగీ […]

15 మంది భారత సిబ్బందితో ఉన్న షిప్ హైజాక్, రంగంలోకి INS చెన్నై

సోమాలియా తీరంలో 15 మంది భారత సిబ్బంది ఉన్న ఓడ హైజాక్‌కు గురైంది.హైజాక్ అయిన నౌక ఎంవీ లిలా నోర్‌ఫోక్‌గా అధికారులు వెల్లడించారు. నౌకపై నిఘా ఉంచేందుకు ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్‌లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక INS చెన్నై పరిస్థితిని పరిష్కరించడానికి హైజాక్ చేసిన ప్రాంతానికి వెళుతోంది. షిప్‌లో పరిస్థితుల్ని అంచనా వేయడానికి సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.అరేబియా సముద్రంలో షిప్ హైజాకింగ్ ప్రయత్నాల గురించి తెలిసిన […]

భారత్‌పై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రశంసలు కురిపించారు.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు భారత్ తమకు అన్ని విధాలుగా సహకారం అందించిందని కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షేక్ హసీనా..నాలుగోసారీ అధికారంలోకి రానున్నారు.. ఈ సమయంలోనే ఆమె భారత్‌ గురించి సానుకూలంగా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.భారత్‌తో మైత్రి కొనసాగించేందుకు తాము ఎప్పటికీ సిద్ధంగానే ఉంటామన్న సంకేతాలిచ్చారు.ఈ సందర్భంగా భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved