loader

సాగరతీరాన.. అంబరమంత అంబేడ్కరుడు..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ సమున్నత శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్మృతివనం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్‌పై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ఆనుకొని ఉన్న 36 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.

ఇది ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశం.. కాలుష్యం చాలా తక్కువ..!

ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ ప్రతిచోటా కాలుష్యం ఉంది.కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి దేశమూ ప్రణాళికలు వేస్తుంది. ఇందులో కాలుష్య రహిత దేశం మొదటి స్థానంలో డెన్మార్క్ ఉంది. పర్యావరణ విషయాలలో డెన్మార్క్ ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది.

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం..

నూతన పార్లమెంట్‌లోని లోక్‌సభ భవనాన్ని జాతీయ పక్షి.. నెమలి థీమ్‌పై, రాజ్యసభను జాతీయ పుష్పం కమలం థీమ్‌పై రూపొందించారు.కొత్త లోక్‌సభ భవనం 888 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. కొత్త రాజ్యసభ హాలు సామర్థ్యాన్ని 384కి పెంచారు. రూ.20 వేల కోట్ల వ్యయంతో కొత్త పార్లమెంట్. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ దక్కించుకున్న టాటా.  రూ.75 నాణెం విడుదల చేయనున్న కేంద్రం

T20 World Cup 2024 టోర్నమెంట్: ఏకంగా 20 జట్లు పోటీ

ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోండటమే దీనికి కారణం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. అన్ని ప్రధాన జట్లతో పాటు కొత్తగా అర్హత సాధించిన పలు టీమ్స్‌.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ 20 జట్లను కూడా నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో అయిదు జట్లు ఉంటాయి. ఈ రెండు గ్రూపుల్లో టాప్‌లో […]

పల్నాడులో ఉద్రిక్తత పరిస్థితులు, 144 సెక్షన్ అమలు

పల్నాడు జిల్లాలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు కేంద్ర బలగాలను మోహరించారు. దాడులు, ప్రతిదాడులతో పల్నాడు జిల్లా అట్టుడుకుతోంది. పోలింగ్ ముగిసినా…పల్నాడు జిల్లాలో కక్షలు చల్లారలేదు. పోలింగ్ సందర్భంగ తలెత్తిన విబేధాలు, ఘర్షణలు మరుసటి రోజూ కొనసాగాయి. కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలో ఘర్షణలో నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. గుంపులుగా బయట తిరిగినా…రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడినా అరెస్ట్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు..

పేటీఎంకు గట్టి దెబ్బ. . . యెస్‌ బ్యాంక్‌, జొమాటో సహా 18 స్టాక్స్‌కు లాభం

ప్రపంచ స్థాయి పెట్టుబడిదార్లు ట్రాక్‌ చేసే “మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్” (MSCI) ఇండెక్స్‌ల్లో మార్పులు, చేర్పులు జరిగాయి.దీని ఫలితంగా మోర్గాన్ స్టాన్లీ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో భారత్‌ నుంచి 13 షేర్లకు చోటు దక్కింది. పేటీఎంతో సహా మూడు షేర్లను నిష్క్రమించాయి. MSCI సూచీల ఆధారంగా ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫండ్ హౌస్‌లు/ ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి.

వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్ ఇతనే..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.అంతే కాదు 23,51,000 చదరపు అడుగుల ప్యాలెస్‌ని కలిగి ఉన్న థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. చాలా మందిని విస్మయానికి గురి చేశాడు.ప్రపంచవ్యాప్తంగా రాచరికాలు ముగిసి రాజకీయ పాలన కొనసాగుతున్నప్పటికీ, రాచరికాలకు కొన్ని అధికారాలు ఇప్పటికీ కొన్ని దేశాలు ఉన్నాయి.థాయిలాండ్‌లోని రాజుకు కూడా వివిధ అధికారాలు ఉన్నాయి. అలాగే అతని కోట్లాది రూపాయల ఆస్తులు ప్రపంచ ధనవంతులను ఆశ్చర్యపరుస్తాయి.

© Copyright 2022 Newz Blog. All Right Reserved