loader
iqonic-blog

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ దక్షిణాది దర్శకులు సినిమాలపై ఓ రేంజిలో పొగడ్తల వర్షం కురిపించారు. గత కొంతకాలంగా సౌత్ సినిమాలు అద్భుతంగా రూపొందుతున్నాయంటూ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షారుఖ్, సౌత్ సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “భారతీయ సినిమాలను ప్రాంతాలుగా విడదీయడం సరికాదు. భారతదేశం విశాలమైన దేశం. దేశవ్యాప్తంగా పలు భాషలు ఉన్నాయి.  తెలుగు, మలయాళం, తమిళ సినిమా పరిశ్రమలలో దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్లు ఉన్నారు. ఇటీవల ‘జవాన్’, ‘RRR’, […]

iqonic-blog

నాలుగేండ్లకోసారి వచ్చే ప్రపంచ అతిపెద్ద క్రీడా పండుగ ముగిసింది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ వేదికగా 17 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించిన ఒలింపిక్స్‌కు ఆదివారంతో తెరపడింది. ఒలింపిక్‌ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీన్‌ నదిలో ప్రారంభ కార్యక్రమాలను నిర్వహించి ‘ఔరా’ అనిపించిన పారిస్‌.. ముగింపు వేడుకలనూ అదే స్థాయిలో మురిపించింది.తదుపరి 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్ లో జరుగనున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఒలింపిక్ బ్యాటెన్ ను లాస్ ఏంజెల్స్ కు అందజేశారు.

iqonic-blog

కూల్ సిటీ.. గ్రీన్ సిటీ.. సిలికాన్ సిటీ అని ఎన్నో పేర్లు ఉన్న బెంగళూరుకు నిత్యం పర్యాటకులు వస్తూనే ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం పంద్రాగస్టు వేడుకల సందర్భంగా లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో విభిన్నమైన థీమ్‌తో అద్భుతమైన ఫ్లవర్ షో నిర్వహిస్తారు. ఈ లాల్‌బాగ్ గార్డెన్‌లో రకరకాల పువ్వులతో అలంకరిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను సన్మానించే విధంగా, ఆయన దేశానికి ముఖ్యమైన పాత్రను వివరించేలా పుష్ప ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

iqonic-blog

నూతన పార్లమెంట్‌లోని లోక్‌సభ భవనాన్ని జాతీయ పక్షి.. నెమలి థీమ్‌పై, రాజ్యసభను జాతీయ పుష్పం కమలం థీమ్‌పై రూపొందించారు.కొత్త లోక్‌సభ భవనం 888 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. కొత్త రాజ్యసభ హాలు సామర్థ్యాన్ని 384కి పెంచారు. రూ.20 వేల కోట్ల వ్యయంతో కొత్త పార్లమెంట్. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ దక్కించుకున్న టాటా.  రూ.75 నాణెం విడుదల చేయనున్న కేంద్రం

iqonic-blog

ఆసియా ఖండంలో జరిగే అతి పెద్ద ఆదివాసి మహా సమ్మేళనం సమ్మక్క -సారలమ్మ జాతర. దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు.. కోటి మందికి పైగానే భక్తులు వస్తారు. 1996లో ఈ జాతరను అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించగా..తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మేడారం జాతర కు ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఫిబ్రవరి 21న బుధవారం.. కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved