loader

చంద్రునిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది.
ఇప్పటికే ల్యాండర్‌ క్షేమంగా దిగడంతో భారత్‌ సంబరాలు చేసుకుంటున్న వేళ.. రోవర్‌కూడా సక్సెస్‌ఫుల్‌గా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై ఇస్రో స్పందిస్తూ ట్వీట్‌ చేసింది ‘చంద్రయాన్‌-3 రోవర్‌ చంద్రుడి కోసం భారత్‌లో తయారైంది.అది ల్యాండర్‌ నుంచి సజావుగా బయటకు వచ్చింది. భారత్‌ చంద్రుడిపై నడిచింది. మిషన్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ తర్వలోనే షేర్‌ చేస్తాం’ అంటూ పేర్కొంది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved