టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సామాజిక కార్యక్రమాల్లో తన వంతు బాధ్యతలను నేరవేరుస్తుంటారు. అశేషమైన తన అభిమాన గణాన్ని సామాజిక సేవ వైపు మళ్లించిన హీరో ఆయన. చిరంజీవి ట్రస్ట్‌ను స్థాపించి రక్తదానం, నేత్రదానం చేయాలని అభిమానులకే కాదు.. ప్రజలకు పిలుపునిచ్చారు